పిచ్చిరెడ్డి కాలనీని సందర్శించిన బిజెపి జిల్లా అధ్యక్షులు

పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ‌ ప్రతినిధి:

పొదిలి నగర పంచాయితీ పరిధిలోని సానికొమ్ము పిచ్చిరెడ్డి కాలనీని
భారతీయ జనతాపార్టీ ప్రకాశం జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ ఆదివారం నాడు సందర్శించారు.

గత వారం రోజులుగా అంకాల పరమేశ్వరి గుడి తొలగించాలని బెదిరింపుల నేపథ్యం పొదిలి టైమ్స్ కధనాలకు స్పందించి ఆదివారం స్థానికంగా ఉన్న ఆంకాల పరమేశ్వరి గుడి ని సందర్శించి స్థానికులకు సంఘీభావం తెలిపారు

మీకు పూర్తి స్థాయిలో భారతీయ జనతా పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో పొదిలి మండల బిజెపి అధ్యక్షులు మాకినేని అమర్ సింహా, జిల్లా ఉపాధ్యక్షులు కంభం వెంకట రమణ తదితరులు పాల్గొన్నారు