గణేష్ ఉత్సవాలకు అనుమతి ఇవ్వాలని బిజెపి నిరసన
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వినాయక చవితి ఉత్సవాలు జరుపుకునేందుకు అనుమతి ఇవ్వాలని భారతీయ జనతాపార్టీ ఆధ్వర్యంలో మండల రెవెన్యూ తహశీల్దారు కార్యాలయం నందు సీనియర్ అసిస్టెంట్ అరుణకు వినతి పత్రాన్ని అందజేశారు.
బుధవారం నాడు స్థానిక పొదిలి మండల రెవెన్యూ తహశీల్దారు కార్యాలయం నందు భారతీయ జనతాపార్టీ నాయకులు వినాయక చవితి ప్రతిమను పెట్టుకొని తమ నిరసనను తెలియజేశారు.
ఈ సందర్భంగా మండల పార్టీ అధ్యక్షులు మాకినేని అమర్ సింహా మాట్లాడుతూ హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరింస్తుందని తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం మొండివైఖరి విడనాడి వినాయకచవితి జరుపుకునేందుకు అనుమతి ఇవ్వాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు మాకినేని అమర్ సింహా , పార్లమెంట్ కమిటీ ప్రధాన కార్యదర్శి శాతరాజుపల్లి చంద్రశేఖర్, స్థానిక నాయకులు మాగులూరి రామయ్య, ఆకుపాటి లక్ష్మణ్, ఎర్రారెడ్డి తదితరులు పాల్గొన్నా