బిజెపి సీనియర్ నాయకులు రావూరి సత్యాలు మృతి

భారతీయ జనతా పార్టీ పొదిలి మండలం సీనియర్ నాయకులు రావూరి వెంకట సత్యనారాయణ (సత్యాలు) అనారోగ్యంతో సోమవారం నాడు మృతి చెందారు.

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ , విశ్య హిందూ పరిషత్, భారతీయ జనతాపార్టీ మరియు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి డిగ్రీ కళాశాల పాలకవర్గం లో రావూరి సత్యాలు పని చేసారు.

రావూరి సత్యాలు మృతి పట్ల హిందూ సంస్థలు, భారతీయ జనతాపార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు సంతాపాన్ని వ్యక్తం చేశారు.