పొదిలిలో బిజెపి శక్తి కేంద్రాల శిక్షణ తరగతులు – శాసనాల సరోజినీ
ఒంగోలు పార్లమెంట్ జిల్లా కమిటీ పరిధిలోని శక్తి కేంద్రాల అధ్యక్షులకు మూడు రోజుల పాటు శిక్షణ తరగతులను నిర్వహింస్తునట్లు జిల్లా శక్తి కేంద్రాల ఇంచార్జ్ శాసనాల సరోజినీ అన్నారు.
ఆదివారం నాడు స్థానిక పొదిలి మండల భారతీయ జనతాపార్టీ కార్యాలయం నందు మండల పార్టీ అధ్యక్షులు మాకినేని అమార్ సింహా అధ్యక్షతనతో జరిగిన సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరైన శక్తి కేంద్రాల జిల్లా శాసనాల సరోజినీ మాట్లాడుతూ ప్రతి మూడు నుంచి ఆరు పొలింగ్ కేంద్రాలకు ఒక శక్తి కేంద్రాన్ని ఏర్పాటు చేసి వారికి మూడు రోజుల పాటు శిక్షణ తరగతులను త్వరలో నిర్వహించిస్తామని ఈ శిక్షణ తరగతుల్లో జాతీయ, రాష్ట్ర స్థాయి నాయకులు హాజరుకానున్నారని తెలిపారు.
బిజెపి లో ప్రధాన మంత్రి నుంచి వార్డు సభ్యుల వరకు ప్రతి ఒక్కరు వారు ప్రాతినిద్యం వహిస్తున్న పొలింగ్ కేంద్రాల్లో అధ్యక్షులు ఉంటారని బిజెపి విజయాల్లో శక్తి కేంద్రాలు కీలకం పని చేస్తు పార్టీ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తుందని ఆమె తెలిపారు.
ఈ కార్యక్రమంలో శక్తి కేంద్రాల సహాయ ఇన్చార్జ్ రాయపాటి అజయ్ కుమార్, స్థానిక నాయకులు మువ్వల పార్థసారథి, శ్రీనివాసులురెడ్డి, మాగులూరి రామయ్య, దాసరి మల్లి, బాబు స్టూడియో శ్రీనివాస్ , ఆకుపాటి లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు