రేపు బిజెపి రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు పొదిలి రాక
పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ప్రతినిధి:
భారతీయ జనతాపార్టీ ప్రకాశం జిల్లా పదాధికారుల సమావేశం కు రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు హాజరుకానున్నారని జిల్లా అధ్యక్షులు సిరసనగండ్ల శ్రీనువాసులు సోమవారం నాడు ఒక ప్రకటన విడుదల చేశారు.
- సోము వీర్రాజు షెడ్యూల్ వివరాలు
- స్థానిక పొదిలి మంజునాథ కళ్యాణ మంటపం నందు ఉదయం 10 గంటల జిల్లా పదాధికారుల సమావేశం
- 11.30 నిమిషాలకు మండల శక్తి కేంద్రాల కన్వీనర్లు తో సమావేశం
- 12:00 గంటల కు మండల పట్టణ అధ్యక్షులతో సమావేశం
- మధ్యాహ్నం 1:00 గంటల మీడియా సమావేశం ఏర్పాటు
- 2:00, గంటలకు స్థానిక పిచ్చిరెడ్డి తోటలోని గిరిజన కాలనీ నందు భోజనాలు
కావున ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్ని జయప్రదం చేయాలని ఒక ప్రకటన లో తెలిపారు