రేషన్ వాహనాల పై ప్రధాని బొమ్మ ఏర్పాటు చెయ్యాలని బిజెవైయం విన
పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ప్రతినిధి:
భారతీయ జనతా యువ మోర్చ అధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రేషన్ పంపిణీ వాహనాలపై భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఫోటోను ఏర్పాటు చేయాలని కోరుతూ ప్రకాశం జిల్లా జాయింట్ కలెక్టర్ కు వినతి పత్రం సమర్పించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శిలు నాయక్ , సుబ్బారెడ్డి , ఉపాధ్యక్షులు నాగ శేషు , రాజేష్ , ట్రెజరీ రాంనాధ్ ,కార్యవర్గ సభ్యులు డేగ సురేష్ తదితరులు పాల్గొన్నారు