రాజధాని రైతుల పాదయాత్ర సంఘీభావ భిక్షాటన
న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు అమరావతి రాజధాని రైతుల తలపెట్టిన 460 కిలోమీటర్ల మహా పాదయాత్రకు సంఘీభావంగా మాజీ శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి ఆధ్వర్యంలో పొదిలి పట్టణం నందు మంగళవారం నాడు స్థానిక చింతచెట్టు సెంటర్ నుంచి చిన్న బస్టాండ్ వరకు జోలి తగిలించుకొని బిక్షాటన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో మార్కాపురం నియోజకవర్గం పరిధిలోని తెలుగు దేశం పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు
ఈ కార్యక్రమంలో తెలుగు దేశం పార్టీ నాయకులు గునుపూడి భాస్కర్,ఆవులూరి యలమంద,పొల్లా నరసింహా యాదవ్,యర్రంరెడ్డి వెంకటేశ్వర రెడ్డి, షేక్ రసూల్, మీగడ ఓబుల్ రెడ్డి, ముల్లా ఖూద్దుస్, కాటూరి నారాయణ ప్రతాప్, మూరబోయిన బాబురావు యాదవ్, చప్పిడి రామ లింగయ్య, పండు అనీల్, షేక్ గౌస్ బాషా, సయ్యద్ ఇమాంసా, జ్యోతి మల్లి,నరసింహారావు, ముల్లా ఖయ్యాం, ముని శ్రీనివాస్, కాటూరి శ్రీను, వివిధ గ్రామాల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు