ములాయం సింగ్ యాదవ్ విగ్రహం ఆవిష్కరణ కార్యక్రమాని జయప్రదం చేయండి

 

కరపత్రం ఆవిష్కరించిన బిసి నాయకులు

మాజీ రక్షణ మంత్రి ములాయం సింగ్ యాదవ్ విగ్రహం ఆవిష్కరణ కరపత్రాన్ని బిసి నాయకులు ఆవిష్కరించారు.

సోమవారం నాడు స్థానిక పొదిలి పట్టణంలోని ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కరపత్రాన్ని ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా పాశం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ జులై 9వ తేదిన గుంటూరు జిల్లా ఖాజా వద్ద ములాయం సింగ్ యాదవ్ విగ్రహం ఆవిష్కరణ అనంతరం నాగార్జున యూనివర్సిటీ ఎదురు ప్రజా చైతన్య వేదిక నందు బహిరంగ సభ జరుగుతుందని ఈ బహిరంగ సభకు సమాజ్ వాదీ పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్, బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజశ్వి యాదవ్, మరియు జాతీయ, రాష్ట్ర స్థాయి ఓబిసి నాయకులు, రాష్ట్రంలోని ఓబిసి ప్రజాప్రతినిధులు తదితరులు హాజరుకానున్నారని కావున ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో బిసి నాయకులు మూరబోయిన బాబురావు యాదవ్, మందగిరి వెంకటేష్ యాదవ్, చంద్రశేఖర్, కనకం వెంకట్రావు యాదవ్ ఉపాధ్యాయ సంఘం నాయకులు శివరాత్రి శ్రీనివాస్, కొనంకీ సంజీవరావు, మైనారిటీ నాయకులు షేక్ మీరావలి తదితరులు పాల్గొన్నారు