వైభవంగా నూర్జహాన్ జన్మదిన వేడుకలు
పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ప్రతినిధి:
యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ పొదిలి పట్టణ అధ్యక్షులు షేక్ నూర్జహాన్ జన్మదిన వేడుకలు స్థానిక భవిత పాఠశాల నందు నిరాడంబరంగా జరిగాయి.
భవిత పాఠశాల నందు తొలుత ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కేక్ ను షేక్ నూర్జహాన్ కోసి బంధువులకు అభిమానులకు పంచిపెట్టారు
అనంతరం బంధుమిత్రులు అభిమానులు శాలువా కప్పి ఘనంగా సత్కరించారు
తదుపరి విద్యార్థులకు నోట్ బుక్స్ ను పంచిపెట్టారు
అనంతరం విద్యార్థులకు భోజనాని ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమంలో పొదిలి మండల విద్యాశాఖాధికారులు శ్రీనివాసులురెడ్డి,నాగలక్ష్మీ, పంచాయతీ రాజ్ ఎఈ మస్తాన్ వలీ, భవిత పాఠశాల ప్రధానోపాధ్యాయులు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు కోగర వెంకట్రావు యాదవ్, నాని యాదవ్,వర్షం ఫిరోజ్,గోపాల్ కృష్ణ, భవిత పాఠశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు
అభిమానులు కార్యకర్తల మధ్య ఘనంగా నూర్జహాన్ జన్మదిన వేడుకలు
పొదిలి పట్టణ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షురాలు షేక్ నూర్జహాన్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి.
స్థానిక ప్రకాశ్ నగర్ లోని తన నివాస గృహం నందు స్థానికులు ఏర్పాటు చేసిన భారీ కేక్ నూర్జహాన్ కట్ చేసారు
ఈ సందర్భంగా పలువురు శాలువాలతో ఘనంగా సత్కరించారు
ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ భవిష్యత్తులో మరిన్నో ఉన్నత పదవులను అలంకరించాలని ఆకాంక్షించారు