సియం సహాయ నిధికి చెక్కును అందజేసిన పులగొర్ల
ముఖ్యమంత్రి సహాయ నిధికి కంభాలపాడు గ్రామ పంచాయతీ తాజా మాజీ సర్పంచ్ పుల్లగొర్ల శ్రీనివాస్ యాదవ్, పులగొర్ల వెంకట్రావు యాదవ్ కలిసి 45వేల రూపాయల చెక్కును మంగళవారంనాడు పొదిలి మండల పర్యటనకు విచ్చేసిన మార్కాపురం నియోజకవర్గం శాసనసభ్యులు కుందూరు నాగార్జునరెడ్డి చేతికి అందజేశారు.
ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ సభ్యులు సాయి రాజేశ్వరరావు, మాజీ ఏఎంసి చైర్మన్ గుజ్జుల రమణారెడ్డి, వైకాపా నాయకులు గుజ్జుల సంజీవరెడ్డి, జి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.