కొబ్బరికాయలు కొట్టి మొక్కు తీర్చుకున్న సాధన సమితి నాయకులు
పొదిలి పెద్ద చెరువు రిజర్వాయర్ మార్పు చెయ్యాలని మరియు పొదిలి రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చెయ్యాలని కోరుతూ సాధన సమితి అధ్యక్షులు గునుపూడి భాస్కర్ ఆధ్వర్యంలో తలపెట్టిన ఉద్యమానికి ప్రభుత్వం దిగివచ్చి పొదిలి పెద్ద చెరువు ను రిజర్వాయర్ కు 50.13 కోట్లు నిధులు మరియు 0.23 టిఎంసిలు నీటి కేటాయింపులు చేస్తు రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చెయ్యటం తో పొదిలి రెవెన్యూ డివిజన్ సాధన సమితి ఆధ్వర్యంలో స్థానిక పార్వతి సమేత నిర్మ మహేశ్వర స్వామి దేవస్థానం నందు సామి వెంకట పద్మావతి సౌజన్యంతో 108 కొబ్బరికాయలు కొట్టి తమ మొక్కును తీర్చుకున్నారు.
ఈ సందర్భంగా డివిజన్ సాధన సమితి నాయకులు మాట్లాడుతూ తమ చేసిన ఉద్యమ ఫలితంగా పెద్ద చెరువు రిజర్వాయర్ మార్పు జరిగిందని అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ లో ఉన్న ప్రకారం పొదిలి కేంద్రంగా రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చెయ్యాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
త్వరలోనే పొదిలి కేంద్రంగా రెవెన్యూ డివిజన్ ఏర్పాటు జరుగుతుందని ఆ ప్రకటన రాగానే 1008 కొబ్బరికాయలతో మొక్కు తీర్చుకుంటమని వారి తెలిపారు.
ఈ కార్యక్రమంలో పొదిలి రెవెన్యూ డివిజన్ సాధన సమితి నాయకులు యర్రం రెడ్డి వెంకటేశ్వర రెడ్డి, కాటూరి వెంకట నారాయణ బాబు, పొల్లా నరసింహా యాదవ్, మూరబోయిన బాబురావు యాదవ్ బండి అశోక్ కనకం వెంకట్రావు,సమంతపూడి నాగేశ్వరరావు సామి పద్మావతి, సయ్యద్ ఇమాంసా,సన్నెబోయిన సుబ్బారావు, వీరేపల్లి శ్రీనివాస్, బరిగే బాలయ్య, ముని శ్రీనివాస్, డాక్టర్ మణి బలగాని నాగరాజు తదితరులు పాల్గొన్నారు