తూర్పు రాయలసీమ పట్టభద్రులు మరియు ఉపాధ్యాయ నియోజకవర్గం రేపు సోమవారం ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ప్రకాశం జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ పోలీస్ కేంద్రాలను సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు.
ఆదివారం నాడు స్థానిక పొదిలి మండల పరిషత్ కార్యాలయం ప్రాంగణంలోని ఏర్పాటు చేసిన మూడు పట్టభద్రుల పోలింగ్ కేంద్రాలను ఒక టీచర్ పోలింగ్ కేంద్రం ను జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ సందర్శించి ఏర్పాట్లను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో మండల ఎన్నికల అధికారులు మరియు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు