పండు అనిల్ కు అభినందనల వెల్లువ
టి యన్ యస్ యఫ్ రాష్ట్ర కార్యదర్శి గా ఎంపికైన వరికుంట్ల అనిల్ ను పెద్ద ఎత్తున కార్యకర్తలు అభిమానులు అభినందించారు.
వివరాల్లోకి వెళితే స్థానిక చింతచెట్టు సెంటర్ లోని తెలుగు దేశం పార్టీ కార్యాలయం నందు ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో పండు అనీల్ మాట్లాడుతూ నాపై నమ్మకంతో రాష్ట్ర కార్యదర్శి గా నన్ను నియమించిన నందుకు తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, జాతీయ కార్యదర్శి నారా లోకేష్, రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు ఎర్రన్నాయుడు, పార్లమెంట్ నియోజకవర్గ కమిటీ అధ్యక్షులు నూకసాని బాలాజీ, నియోజకవర్గం ఇన్చార్జ్ కందుల నారాయణరెడ్డి లకు కృతజ్ఞతలు తెలిపారు.
అనంతరం తెలుగు దేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పండు అనీల్ ఘనంగా సత్కరించి అనంతరం కేక్ కట్ చేసి కార్యకర్తలకు అభిమానులకు పంచిపెట్టారు..
ఈ కార్యక్రమంలో తెలుగు దేశం పార్టీ నాయకులు షేక్ రసూల్, మీగడ ఓబుల్ రెడ్డి, ముల్లా ఖూద్దుస్ విద్యార్థి విభాగం నాయకులు షేక్ గౌస్ బాషా నిరంజన్ తదితరులు పాల్గొన్నారు