ఆధార్ కష్టాలు తీర్చండి సిపిఐ కార్యదర్శి కె వి రత్నం డిమాండ్
ఆధార్ కార్డుకు మొబైల్ నెంబర్ అనుసంధానం ప్రక్రియ కష్టాలను తీర్చాలని పొదిలి మండలం సిపిఐ కార్యదర్శి కె వి రత్నం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
వివరాల్లోకి వెళితే గురువారం నాడు స్థానిక బి యస్ యన్ యల్ కార్యాలయం వద్ద ఆధార్ అనుసంధానం కోసం బారులు తీరిన ప్రజలు తీవ్ర అసౌకర్యంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నా విషయం స్పందించిన సిపిఐ కార్యదర్శి కె వి రత్నం వారిని అడిగి వారి సమస్యల్ని తెలుసుకుంటున్నారు
అనంతరం తనను కలిసిన విలేఖరులతో మాట్లాడుతూ పట్టణంలో కేవలం ఓకే సెంటర్ ఏర్పాటు వలన ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నరని
తక్షణమే ప్రజల సౌకర్యార్థం గ్రామ సచివాలయల్లో ఆధార్ అనుసంధానం చేసే విధంగా చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.