పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని తెలుగు దేశం పార్టీ ఆధ్వర్యంలో ధర్నా

ప్రకాశం జిల్లా కొనకనమీట్ల నందు తెలుగు దేశం పార్టీ ఆధ్వర్యంలో పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని కోరుతూ పెట్రోల్ బంక్ వద్ద మంగళవారం నాడు ధర్నా చేపట్టారు.

కొనకనమీట్ల మండల తెలుగు దేశం పార్టీ అధ్యక్షులు మూరబోయిన బాబురావు యాదవ్ ఆధ్వర్యంలో తలపెట్టిన ధర్నా ముఖ్య అతిథిగా హాజరైన మార్కాపురం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్ కందుల నారాయణరెడ్డి మాట్లాడుతూ తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్ పై 16 రూపాయలు డీజిల్ పై 17 రూపాయలు తగ్గించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో తెలుగు దేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

ఈ కార్యక్రమంలో ఒంగోలు పార్లమెంటరీ పార్టీ తెలుగుదేశం కార్యనిర్వాహక కార్యదర్శి పోల్ల నరసింహారావు , ఒంగోలు పార్లమెంటరీ పార్టీ తెలుగుదేశం కార్యదర్శి  వెంకటేశ్వర రెడ్డి , కొనకనమిట్ల మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మొరబోయిన బాబురావు యాదవ్, ఏఎంసీ మాజీ చైర్మన్లు చప్పిడి రామలింగయ్య కాకర్ల శ్రీనివాస్ యాదవ్ ,కొనకనమిట్ల మాజీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కనకం నరసింహారావు, మార్కాపురం మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జవాజి రామానుజుల రెడ్డి , తర్లుపాడు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఉడుముల చిన్నప రెడ్డి, సమన్వయ కమిటీ సభ్యులు పుచ్చ నూతల గోపీనాథ్ గారు, కొనకనమిట్ల తెలుగుదేశం మండల నాయకులు వెలుగొండ దేవస్థానం మాజీ చైర్మన్ కుoదురు కాశిరెడ్డి , బాపతు కృష్ణారెడ్డి , బరిగే బాలయ్య , దేవి రెడ్డి శ్రీనివాస్ రెడ్డి వివిధ గ్రామాల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు