ఉచిత బియ్యం పంపిణీ చేయాలని బిజెపి ఆధ్వర్యంలో ధర్నా

పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ‌ ప్రతినిధి:

కేంద్ర ప్రభుత్వం పేదలకు ఉచితంగా అందిస్తున్న బియ్యం వెంటనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేయాలని కోరుతూ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.

సోమవారం నాడు స్థానిక పొదిలి మండల రెవెన్యూ తహశీల్దారు కార్యాలయం వద్ద భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు మాకినేని అమర్ సింహా ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు

ఈ సందర్భంగా బిజెపి నాయకులు మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పేదవారికి ఉచితంగా బియ్యం ఇవ్వాలని తలంపుతో గరీబ్ కళ్యాణ్ యోజన పథకం ద్వారా గత రెండు సంవత్సరాలుగా ఇస్తున్న ఉచిత బియ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం పేదవారికి ఉచిత బియ్యాన్ని ఇవ్వడం ఆపేశారని వెంటనే పేద ప్రజలకు ఉచిత బియ్యాన్ని ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో స్థానిక భారతీయ జనతా పార్టీ నాయకులు మాగులూరి రామయ్య, పందింటి మురళి కృష్ణ, చంద్రశేఖర్, సూరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, దాసరి మల్లి, బాబు స్టూడియో శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు