పెంచిన ఆర్టీసీ చార్జీలు నిరసిస్తూ టిడిపి ఆధ్వర్యంలో ధర్నా

పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ‌ ప్రతినిధి:

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పెంచిన ఆర్టీసీ చార్జీలను నిరసిస్తూ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు పొదిలి, కొనకనమీట్ల మండలాల్లో జాతీయ రహదారిలుపై రాస్తారోకో నిర్వహించారు.

ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ నెల రోజుల్లో రెండు సార్లు ఆర్టీసీ చార్జీలు పెంచుటంతో సామాన్యుడు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం పెంచిన ఆర్టీసీ చార్జీలను తగ్గించాలని డిమాండ్ చేశారు.

విషయం తెలుసుకున్న పొదిలి యస్ఐ శ్రీహరి,కొనకనమీట్ల యస్ఐ ఫణి కుమార్ లు సంఘటన స్థలానికి చేరుకొని రాస్తారోకో విరమింపజేశారు.

అనంతరం భారిగా నిలిచిన ట్రాఫిక్ ను క్రమబద్ధీకరణ చేసారు

 

ఈ కార్యక్రమంలో పొదిలి మండల తెలుగు దేశం పార్టీ నాయకులు గునుపూడి భాస్కర్, యర్రంరెడ్డి వెంకటేశ్వర రెడ్డి,పొల్లా నరసింహా యాదవ్, షేక్ రసూల్,సమంతపూడి నాగేశ్వరరావు, సయ్యద్ ఇమాంసా,కాటూరి నారాయణ ప్రతాప్, మీగడ ఓబుల్ రెడ్డి,ముల్లా ఖూద్దుస్, ఎండీ గౌస్, స్వర్ణ ప్రీతం కృష్ణ, షేక్ గౌస్ భాష, జ్యోతి మల్లి, మహ్మద్, కాటూరి శ్రీను, సుబ్బారావు, షేక్ మస్తాన్ వలి, షేక్ నజీర్ (గన్) తదితరులు పాల్గొన్నారు

 

కొనకనమీట్ల తెలుగు దేశం పార్టీ మండల అధ్యక్షులు మూరబోయిన బాబురావు, మండల నాయకులు వెంకట నారాయణ, మువ్వా కాటంరాజు, బాషాపతి,అంకాల రోశయ్య, కొడే గురవయ్య, వెంకటేశ్వర్లు,దేవిరెడ్డి శ్రీనివాసులు, క్రిష్ణారెడ్డి, రమణారెడ్డి, కొటేశ్వరరావు, లక్ష్మయ్య, రామిరెడ్డి,బరిగే బాలయ్య, రత్నం, తిరుపతిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.