వీర జవాన్ సుబ్బయ్య మృతికి జిల్లా కాంగ్రెస్ పార్టీ సంతాపం

పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ‌ ప్రతినిధి:

భరతమాత ముద్దుబిడ్డ దేశ రక్షణ కోసం గత 23 సంవత్సరాలుగా సైన్యంలో వివిధ హోదాల్లో పనిచేస్తూ జమ్మూ కాశ్మీర్ లో విధులు నిర్వహిస్తూ తీవ్రవాదులు అమర్చిన ల్యాండ్ మైన్ నుండి తన తోటి సైనికులు 30 మంది ప్రాణాలు కాపాడి అమరుడైన ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గం కంభం మండలంలోని రావిపాడు గ్రామానికి చెందిన వరికుంట సుబ్బయ్య మృతికి కాంగ్రెస్ పార్టీ తీవ్ర సంతాపాన్ని సానుభూతిని తెలియజేస్తుందని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు షేక్ సైదా నేడు ఒక ప్రకటనలో తెలిపారు.

మృత్యువులోను తన తోటి వారినీ ఆదుకోవాలని ధైర్య సాహసాలను ప్రదర్శించి వారినీ అప్రమత్తం చేసి 30 మంది ప్రాణాలను కాపాడిన సుబ్బయ్యకు కేంద్ర ప్రభుత్వం పరమ వీర చక్ర ఆవార్డు ఇవ్వాలని, ఒక సామాన్య రైతు కుటుంబమైనా ఆ కుటుంబానికి, వారి భార్య బిడ్డలకు, వారి తల్లిదండ్రులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇ ఆర్థికంగా రెండు కోట్ల రూపాయలు ఇచ్చి ఆదుకోవాలని వారి పిల్లల చదువుకు అయ్యే ఖర్చును కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లు పూర్తిగా భరించాలని సుబ్బయ్య సతీమణికి స్పెషల్ పెన్షన్ ఇవ్వాలని ఐదు ఎకరాల వ్యవసాయ భూమిని అలాగే వారు కోరుకున్న చోట ఐదు సెంట్ల ఇళ్ల స్థలాన్ని, ఇంటిని నిర్మించి ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుందని షేక్ సైదా తెలిపారు.