బూత్ కమిటీలతో సమావేశమైన కందుల
పొదిలి మండలంలోని అన్నవరం కంచేపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని తెలుగు దేశం పార్టీ బూత్ కమిటీలతో గురువారం నాడు మార్కాపురం నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా బూత్ కమిటీలతో సమావేశమైన కందుల నారాయణరెడ్డి భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళిక అదే విధంగా బూత్ స్థాయిలో అనుసరించే వ్యూహం పై బూత్ కమిటీ సభ్యులకు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో పొదిలి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మీగడ ఓబుల్ రెడ్డి , పట్టణ అధ్యక్షులు ముల్లా ఖుద్దూస్ ,ఒంగోలు పార్లమెంట్ మైనారిటీ సెల్ అధ్యక్షులు షేక్ రసూల్ , టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి వరికుంట్ల అనిల్ , ఒంగోలు పార్లమెంట్ టీఎన్ఎస్ఎఫ్ ప్రధాన కార్యదర్శి షేక్ గౌస్ బాషా మార్కాపురం మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జవ్వాజి రామానుజల రెడ్డి తెలుగుదేశం నాయకులు పులి వెంకటేశ్వర్ రెడ్డి, బ్రాహ్మరెడ్డి, పేరం బలరాం రెడ్డి, మాజీ ఎంపీటీసీ పాపిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.