మున్సిపల్ , మండలం కమిటీల పై దృష్టి సారించిన కందుల త్వరలో నూతన కమిటీలు ఏర్పాటుకు రంగం సిద్ధం
మార్కాపురం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్ మాజీ శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి గత కొంతకాలంగా పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేస్తు నిరంతరం ప్రజల్లో మమేకం అవుతూ వెలుగొండ ప్రాజెక్టు కు నికర జలాలు కేటాయించాలని డిమాండ్ చేస్తూ గ్రామాల్లో కాగడాల ప్రదర్శనలు నిర్వహించే క్రమంలో పోలీసులు అడ్డుకునే ప్రయత్నాలు చేసినా తనదైన శైలిలో గ్రామాల్లో పర్యటిస్తూ ప్రజల మనిషిగా నియోజకవర్గ ప్రజా హృదయాల్లో స్థానం సంపాదించారు .
ఒక పక్క ప్రజా ఉద్యమాలు నిర్వహిస్తూ మరోపక్క పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేస్తున్నారు మార్కాపురం నియోజకవర్గం పరిధిలోని మార్కాపురం మున్సిపల్ కమిటి, మార్కాపురం గ్రామీణ మండల కమిటీ, తర్లుబాడు మండల కమిటీ, కొనకనమీట్ల మండల కమిటీలు పూర్తి చేసారు.
పొదిలి మండలం పరిధిలోని పొదిలి, మాదాల వారి పాలెం, నంది పాలెం, కంభాలపాడు గ్రామ పంచాయతీ లను కలుపుకొని పొదిలి నగర పంచాయితీ ఏర్పాటు చేసిన దృష్ట్యా పొదిలి మున్సిపాలిటీ కమిటీ, మీగత 16 గ్రామ పంచాయతీ లతో పొదిలి గ్రామీణ మండల కమిటీ ఏర్పాటు పై కందుల నారాయణరెడ్డి దృష్టి సారించారు.
త్వరలో పొదిలి నగర పంచాయితీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పొదిలి నగర పంచాయితీని కైవసం చేసుకొనే దిశగా పార్టీ ఇన్చార్జ్ కందుల నారాయణరెడ్డి దృష్టి సారించి సామాజిక సమీకరణాలను బేరీజు వేసుకొని నూతన మున్సిపల్ కమిటీ కూర్పు మొదలుపెట్టారు త్వరలో మున్సిపల్ పరిధిలోని కార్యకర్తలతో సమావేశం నిర్వహించి నూతన కమిటీని ఏర్పాటు దిశగా అడుగులు వేస్తున్నారు.
మున్సిపల్ ఎన్నికలతో పాటు పొదిలి మండల పరిషత్ మరియు జిల్లా ప్రాదేశిక నియోజకవర్గ సభ్యులు (జెడ్పీటీసీ) ఎన్నికలు జరిగే అవకాశం ఉండటంతో మున్సిపల్ కమిటీ ఎంపిక పూర్తి అయిన తరువాత పొదిలి గ్రామీణ మండల కమిటీ ఏర్పాటు చేసేందుకు కసరత్తు ప్రారంభించినట్లు సమాచారం
త్వరలో పొదిలి మున్సిపాలిటీ కమిటీ, పొదిలి గ్రామీణ మండల కమిటీలు ఏర్పాటుతో నియోజకవర్గంలో కమిటీలు ఏర్పాటు ప్రక్రియ పూర్తి అవుతుంది అనంతరం మార్కాపురం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్ కందుల నారాయణరెడ్డి నిరంతరం ప్రజల్లో మమేకం అవుతూ ప్రజల్లో తిరిగేలా రూట్ మ్యాప్ తయారు చేసినట్లు సమాచారం .