రేపు కందుల జల దీక్ష
మార్కాపురం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ మాజీ శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో రేపు జల దీక్ష చేపట్టనున్నారు.
స్థానిక చింత చెట్టు సెంటర్ వద్ద గల తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు సోమవారం ఉదయం 10 గంటలకు జన దీక్ష ప్రారంభం అవుతుందని మండల తెలుగు దేశం పార్టీ అధ్యక్షులు మీగడ ఓబుల్ రెడ్డి పట్టణ అధ్యక్షులు ముల్లా ఖూద్దుస్ ఆదివారం నాడు ఒక ప్రకటనలో తెలిపారు.
వెలిగొండ ప్రాజెక్టు పరిధిలో పొదిలి మండలం చేర్చాలని మరియు పొదిలి పెద్ద చెరువు సమ్మర్ స్టోరేజ్ గా మార్చాలని కోరుతూ మాజీ శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి తలపెట్టిన జల దీక్షలో తెలుగు దేశం పార్టీ కార్యకర్తలు వేలాదిగా ప్రజలు తరలివచ్చి జల దీక్షను జయప్రదం చేయాలని కోరారు