ఎన్టీఆర్ విశ్వవిద్యాలయం పేరు కొనసాగించాలని కోరుతూ నిరాహారదీక్ష

పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ‌ ప్రతినిధి:

 

ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును కొనసాగించాలని కోరుతూ పొదిలి మండల రెవెన్యూ తహశీల్దారు కార్యాలయం వద్ద నిరాహార దీక్ష శిబిరాన్ని ప్రారంభించారు.

బుధవారం నాడు స్థానిక మండల రెవెన్యూ తహశీల్దారు కార్యాలయం వద్ద తెలుగు దేశం పార్టీ ఆధ్వర్యంలో నిరాహార దీక్షలు చేపట్టారు.

ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం
మొండి వైఖరి విడనాడి యధా విధంగా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు కొనసాగించాలని డిమాండ్ చేశారు.

సాయంత్రం 4గంటలకు దీక్ష ను విరమింపజేశారు.

ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ సభ్యులు కాటూరి వెంకట నారాయణ బాబు , మాజీ సర్పంచ్ కాటూరి నారాయణ ప్రతాప్ , మాజీ సర్పంచ్ స్వర్ణ గీత, తెలుగు దేశం పార్టీ పార్లమెంటు కమిటీ కార్యనిర్వహక కార్యదర్శి పొల్లా నరసింహ యాదవ్, కార్యదర్శి యర్రంరెడ్డి వెంకటేశ్వర రెడ్డి, తెలుగు మహిళ నాయకురాలు షేక్ మరియు షన్వాజ్, లీగ్ సెల్ పార్లమెంట్ కమిటీ అధికార ప్రతినిధి షేక్ షబ్బీర్,తెలుగు నాడు విద్యార్థి సమాఖ్య పార్లమెంట్ కమిటీ కార్యదర్శి షేక్ గౌస్ భాష, మండల,పట్టణ అధ్యక్షులు మీగడ ఓబుల్ రెడ్డి, ముల్లా ఖూద్దుస్ మాజీ ఎంపిటిసి సభ్యులు సయ్యద్ ఇమాంసా, తెలుగు దేశం పార్టీ మైనారిటీ విభాగం మండల అధ్యక్షులు షేక్ మస్తాన్ వలి, తెలుగు దేశం పార్టీ నాయకులు కాటూరి శ్రీను జ్యోతి మల్లి నరసింహారావు, మమిళ్లపల్లి వెంకటేష్, తెలుగు యువత మండల అధ్యక్షులు పోపురి నరేష్, తదితరులు పాల్గొన్నారు