మార్కాపురం జిల్లా తోనే భవిష్యత్ తరాల అభివృద్ధి సాధ్యం— కందుల
కొనకనమిట్ల మండలంలో పెదారికట్ల గ్రామంలో కొనకనమిట్ల మండల తెలుగు దేశం పార్టీ అధ్యక్షులు మూరబోయిన బాబురావు యాదవ్ ఆధ్వర్యంలో కాగడాల ప్రదర్శన నిర్వహించారు.
ఈ సందర్భంగా జేఏసీ చైర్మన్ మార్కాపురం మాజీ శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి గారు మాట్లాడుతూ 1970 సంవత్సరంలో ప్రకాశం జిల్లా ఏర్పాటు చేశారని అప్పటినుండి ఇప్పటివరకు అన్ని రంగాలలో పశ్చిమ ప్రకాశం వెనుకబడి వున్నదని ప్రత్యేక జిల్లా సాధనకై గత 55 రోజులుగా ఉద్యమాలు చేశామని ఈ ఉద్యమం ఊరూరా తీసుకు వెళ్ళుటకు గ్రామాల్లో పర్యటిస్తున్న మని తెలియజేశారు.
భవిష్యత్తులో ఈ ఒక్కరి భాగస్వామ్యంతో మార్కాపురం జిల్లా సాధిస్తామని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు మోర బోయిన బాబు రావు యాదవ్ , పొదిలి ఏ ఏం సి మాజీ చైర్మన్ లు చప్పిడి రామలింగయ్య ,నరసింహరావు గారు, మాజీ మండల పార్టీ అధ్యక్షులు కనకం నరసింహారావు గారు సీనియర్ నాయకులు యెదుపాటి వెంకట నారాయణ , ఒంగోలు జిల్లా తెలుగు యువత మువ్వ కాటం రాజు యాదవ్ , శ్రీకాంత్ రెడ్డి , తెలుగుదేశం నాయకులు అంకాల రోశయ్య ,మాజీ సర్పంచ్ బొంతయ్య గారు, గ్రామ తెలుగుదేశం నాయకులు మూలే చెన్నా రెడ్డి , బాపతి కృష్ణా రెడ్డి , నిమ్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.