ఘనంగా రసూల్ జన్మదిన వేడుకలు

 

పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ‌ ప్రతినిధి:

 

తెలుగు దేశం పార్టీ ఒంగోలు పార్లమెంట్ కమిటీ మైనారిటీ విభాగం అధ్యక్షులు షేక్ రసూల్ మహమ్మద్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.

గురు వారం నాడు స్థానిక పెద్ద బస్టాండ్ లోని ప్రథమ చికిత్స కేంద్ర నందు పొదిలి టాకీస్ వారు ఏర్పాటు చేసిన కేక్ ను కోసి మిత్రులకు పంచిపెట్టారు.

ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ సభ్యులు కాటూరి వెంకట నారాయణ బాబు, తెలుగు దేశం పార్టీ ఒంగోలు పార్లమెంట్ కమిటీ కార్యదర్శి యర్రంరెడ్డి వెంకటేశ్వర రెడ్డి, గ్రామీణ వైద్యుల సంఘం అధ్యక్షులు కె యస్ నారాయణ, మైనారిటీ సెల్ నాయకులు షేక్ యాసిన్, షేక్ మస్తాన్ వలి, షేక్ మీరా మొహిద్దీన్, బుజ్జిగా, మజీద్, ఖాదర్, ఖాదర్ భాషా, జమీర్, యస్సీ సెల్ నాయకులు అరిక రాము, జమీర్ ఓబుల్ శెట్టి వారి వీధి టిడిపి యూత్ బండి సురేష్, బండి నాగార్జున గజ్జలకొండ వెంకటేష్, లుకాని శ్రీనివాసులు, ఎం సందీప్, పీ. శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు