పట్టాలు రద్దు చేస్తామని అధికారులు వేధింపులు ఆగ్రహం వ్యక్తం చేసిన మహిళలు

పొదిలి మున్సిపల్ పరిధిలోని నివాసం ఉంటున్న గృహస్తులు జగనన్న కాలనీ లో గృహాలు కట్టుకునేందుకు మా దగ్గర డబ్బులు లేవు అని.. శక్తి ఉన్నప్పుడే మేము కట్టుకునేంతవరకు మా పట్టాలు మాకు ఉంచాలి అని డిమాండ్ చేస్తూ మండల పరిషత్ అభివృద్ధి అధికారి కార్యాలయం వద్ద మరియు మున్సిపల్ కార్యాలయం వద్ద సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు

ఈ సందర్భంగా పలువురు మహిళలు మాట్లాడుతూ ఇళ్లు కట్టుకోకపోతే ఇండ్లు పట్టాలు రద్దు చేస్తామని వాలంటీర్లు అధికారులు వేధింపులు గురి చేస్తున్నారని తక్షణమే అధికారులు స్పందించి తమకు ప్రభుత్వమే ఇండ్లు నిర్మించి తమకు అందించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో సిపిఎం ప్రాంతీయ కార్యదర్శి యం రమేష్ మరియు మహిళలు తదితరులు పాల్గొన్నారు