తెదేపా బంద్ ను నిరసిస్తూ వైకాపా ఆధ్వర్యంలో మానవహారం ధర్నా

తెలుగు దేశం పార్టీ రాష్ట్ర బంద్ ను నిరసిస్తూ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఆధ్వర్యంలో మానవహారం మరియు ధర్నా చేపట్టారు.

తొలుత స్థానిక పొదిలి పెద్ద బస్టాండ్ వద్ద ఉన్న వైయస్సార్ విగ్రహానికి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
అనంతరం పెద్ద బస్టాండ్ వద్ద మానవహారన్ని నిర్వహించి తదుపరి తహశీల్దారు కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి తదుపరి తహశీల్దారు షేక్ మహమ్మద్ రఫీ కి వినతి పత్రాన్ని అందజేశారు.

ఈ సందర్భంగా పలువురు వైకాపా నాయకులు మాట్లాడుతూ తెలుగు దేశం పార్టీ నాయకులు బరితెగించి మాట్లాడుతూ వైకాపా శ్రేణులను రెచ్చగొట్టే విధంగా ఉన్నాయని మరియు రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు ఇప్పడికైన
తెలుగు దేశం పార్టీ నాయకులు తమ తీరును మార్చుకోవాలని లేకపోతే తీవ్ర స్థాయిలో ప్రతిఘటన ఉంటుందని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సానికొమ్ము శ్రీనువాసులరెడ్డి‌, వాకా వెంకట రెడ్డి,కల్లం వెంకట సుబ్బారెడ్డి, జి శ్రీనివాసులు, గొలమారి చెన్నారెడ్డి, సాయి రాజేశ్వరరావు, సంజీవరెడ్డి, షేక్ రబ్బానీ, వర్షం ఫిరోజ్, మహిళా నాయకురాలు షేక్ నూర్జహాన్ షేక్ గౌసియా తదితరులు పాల్గొన్నారు