జనసేన జెండాను ఆవిష్కరించిన ఇమ్మడి కాశీనాథ్
జనసేన పార్టీ జెండాను మార్కాపురం నియోజకవర్గం జనసేన ఇన్చార్జ్ ఇమ్మడి కాశీనాథ్ ఆవిష్కరించారు.
వివరాల్లోకి వెళితే శనివారం నాడు స్థానిక మండలంలోని బట్టువారిపాలెం గ్రామం నందు జనసైనికులు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన ఇమ్మడి కాశీనాథ్ పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ ఆదేశాల మేరకు ప్రతి గ్రామంలో పార్టీ జెండాను ఎగురవేసి విధంగా కార్యాచరణ ప్రణాళిక ప్రకారం ముందుకు సాగుతున్నమని అదే విధంగా ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న అరాచక పాలన గురించి ప్రజలను చైతన్యవంతులుగా తయారు చెయ్యాలని అన్నారు.
నిరంతరం ప్రజల్లో ఉంటూ ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజా ఉద్యమాలను నిర్మించి ప్రజా అభిమానాన్ని సంపాదించుకొని 2024లో పవన్ కళ్యాణ్ ను ముఖ్యమంత్రి చేసే విధంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు.
పొదిలి మండలం లో చురుకైన పాత్ర పోషిస్తున్న వరికూటి నాగరాజు, సుబ్బారావును ప్రత్యేకంగా అభినందించారు.
ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి తిరుమల శెట్టి వీరయ్య, సహాయ కార్యదర్శి సురేష్, న్యాయ విభాగం జిల్లా కార్యదర్శి వరికుటి నాగరాజు, జనసేన పార్టీ జిల్లా నాయకులు షేక్ ఇమంసా, మహిళా నాయకురాలు బెల్లంకొండ విజయలక్ష్మి, శైలజా, పొదిలి మండల జనసేన పార్టీ నాయకులు పేరుసాముల శ్రీనివాస్, షేక్ కాలేషా, హల్చల్ జహీర్ యువజన, విద్యార్థి విభాగాల చెందిన నాయకులు తదితరులు పాల్గొన్నారు.