జనసేన ఎన్నికల గుర్తుగా గ్లాసు కేటయింపు
జనసేన పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం గ్లాసు గుర్తును కేటాయించింది. దేశవ్యాప్తంగా కొత్తగా నమోదైన 29 పార్టీలకు కేంద్ర ఎన్నికల సంఘం గుర్తులను కేటాయించింది. ఇందులో భాగంగా పవన్ కళ్యాణ్ సారథ్యంలోని జనసేనకు కూడా గాజు గ్లాసు గుర్తును కేటాయించింది. 2019లో జరగనున్న సాధారణ ఎన్నికల్లో జనసేన తరఫున పోటీ చేసే అభ్యర్థులు ఈ గుర్తు మీద పోటీ చేస్తారు. పార్లమెంటు ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నక్రమంలో… అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఆ పార్టీకి ఇదే గుర్తు వర్తిస్తుందని తెలిపింది ఎన్నికల సంఘం.