కెఏ పాల్ తో పోటీగా మోదీ…..
ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కెఎ పాల్ తో భారత ప్రధాని నరేంద్ర మోదీ పోటీ పోటీ పడుతున్నారా?
వివరాల్లోకి వెళితే ఒక జాతీయ ఛానల్ కు ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పలు అంశాలు ఆయన మాట్లాడిన తీరును పరిశీలిస్తే కడుపుబ్బి పోవాల్సిందే….. మరి ఆ మాటలు ఏంటో పరిశీలిద్దామా….
1987లో అద్వానీ నిర్వహించిన ఓ బహిరంగ సభలో డిజిటల్ కెమెరాతో ఫోటో తీసి ఇమొయిల్ ద్వారా ఢిల్లీ పంపించానని తరువాతి రోజు పత్రికలో తాను పంపిన ఫోటో పేపర్ లో చూడడంతో షాక్ అయ్యానని ఆయన తెలిపారు.
వాస్తవానికి డిజిటల్ కెమెరా 1989లో మార్కెట్ లోకి జపాన్ తీసుకొని రాగా….. భారత్ లో ఇమొయిల్ వాడకం సాధరణ ప్రజలకు 1995 నుండి అందుబాటులోకి వచ్చింది.
ఈ విషయం మన ప్రధానికి తెలుసోలేదో…… ఏపీ రాజకీయాల్లో ప్రజలకు వినోదాన్ని పండించే కెఏ పాల్ మాటల మాదిరిగానే మన భారత ప్రధాని మాట్లాతున్నారంటూ నెటిజన్లు జోకులమీద జోకులు వేసుకుంటున్నారు.