కందుల పాదయాత్రకు అడుగడుగునా నీరాజనం…..
మార్కాపురం నియోజకవర్గ టిడిపి ఇన్ఛార్జి కందుల నారాయణరెడ్డి ప్రారంభించిన అభివృద్ధి చేస్తున్నాం – ఆశీర్వదించండి అనే నినాదంతో మొదలైన పాదయాత్రకు ప్రజలు అడుగడుగునా నీరాజనాలు పలికారు. వివరాల్లోకి వెళితే గురువారంనాడు మధ్యాహ్నం పొదిలి మండలంలోనికి ప్రవేశించిన కందుల నారాయణరెడ్డి పాదయాత్రకు ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం కంభాలపాడులో సభ నిర్వహించి తెలుగుదేశం ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. అనంతరం కంభాలపాడు నుండి బయలుదేరిన పాదయాత్ర పోతవరం చేరుకోగానే ప్రజలు బాణాసంచా కాల్చి మహిళలు కుంకుమతిలకం దిద్ది హారతులతో స్వాగతం పలికారు. పాదయాత్రకు ప్రజలనుండి వస్తున్న స్పందనతో తెదేపా శ్రేణులలో నూతనోత్సాహం నెలకొంది.