ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండాలని కందుల పిలుపు

రాష్ట్ర శాసనసభ కు ఎప్పుడూ ఎన్నికలు వచ్చినా ఎదుర్కొనేందుకు కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని తెలుగు దేశం పార్టీ మార్కాపురం నియోజకవర్గం ఇన్చార్జ్ కందుల నారాయణరెడ్డి అన్నారు.

శనివారం నాడు స్థానిక సాయి బాలాజీ కళ్యాణ మంటపం నందు మార్కాపురం మాజీ శాసనసభ్యులు నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో పొదిలి కొనకనమిట్ల మండలాల కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా మాజీ శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి మాట్లాడుతూ ఇటీవల ఒంగోలు లో జరిగిన మహానాడుకు మార్కాపురం నియోజకవర్గం నుంచి స్వచ్ఛందంగా భారీ ఎత్తున తరలి వెళ్లిన పార్టీ నాయకులకు కార్యకర్తలకు అభినందనలు తెలియజేశారు.

మహానాడు జయప్రదం చేసినందుకు ప్రత్యేకంగా చంద్రబాబునాయుడు మన జిల్లా నాయకులను అభినందించారని గుర్తు చేశారు.

2014- 19 సంవత్సరాల మధ్యకాలంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మనం కక్ష సాధింపులకు వెళ్లా లేదని ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వ మూడేళ్ల కాలంలో ఎవరి పొలాలకు ఎవరి స్థలాలకు రక్షణ లేకుండా పోయిందని వైసీపీ గుండాలు కబ్జాలు దౌర్జన్యాలకు పాల్పడి భయబ్రాంతులకు గురి చేస్తున్నారని అన్నారు.

కొనకనమిట్ల మండలంలో ఉపాధి హామీ పనులలో నెలకు 50 లక్షల దోపిడి జరుగుతుందని వార్తలు వస్తున్నాయని వైసీపీ ప్రభుత్వంలో అవినీతికి పరాకాష్ట చేరిందని అన్నారు.

తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పొదిలి కొనకనమిట్ల మండలాలకు తాగునీరు సాగునీరు ఇబ్బంది లేకుండా వెలిగొండ ప్రాజెక్టు ఆయుకట్టు కింద చేరుస్తానని ప్రకటించారు.

వైసిపి నాయకులు అధికారుల అండదండలతో వాలంటీర్ల దౌర్జన్యలతో ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నారని వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వస్తే ఊర్లకు ఊర్లు ఖాళీ చేసే పరిస్థితి వస్తుందని ఇప్పటికైనా వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం కు పట్టం కట్టాలని పిలుపునిచ్చారు.

గ్రామాలు మరియు పట్టణాలలో తెలుగుదేశం నాయకులు గ్రామ కమిటీ సభ్యులు బూత్ కమిటీ సభ్యులు ప్రతి ఒక్కరూ సభ్యత్వ నమోదు కార్యక్రమం లో సమిష్టిగా పాల్గొని తెలుగుదేశం సానుభూతిపరులకు సభ్యత్వ నమోదు కార్యక్రమం రేపటి నుండి దిగ్విజయంగా చేపట్టాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో పొదిలి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మీగడ ఓబుల్ రెడ్డి , కొనకనమిట్ల మండల పార్టీ అధ్యక్షులు మూరబోయిన బాబురావు యాదవ్, మాజీ జడ్పిటిసి సభ్యులు కాటూరి వెంకట నారాయణ బాబు, మాజీ సర్పంచ్ కాటూరి నారాయణ ప్రతాప్ , తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి గునుపూడి భాస్కర్, ఒంగోలు పార్లమెంట్ కార్యనిర్వాహక కార్యదర్శి పొల్లా నరసింహారావు, ఒంగోలు పార్లమెంట్ కార్యదర్శి యర్రం రెడ్డి వెంకటేశ్వర రెడ్డి,పొదిలి ఏఎంసీ మాజీ చైర్మన్ చప్పిడి రామలింగయ్య,సమంతపూడి నాగేశ్వరరావు, టి యన్ యస్ యఫ్ రాష్ట్ర కార్యదర్శి వరికుంట్ల అనిల్, టిఎన్ఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ గౌస్ బాష,సమన్వయ కమిటీ సభ్యులు ఎస్ ఎం బాషా, కొనకనమిట్ల సీనియర్ నాయకులు వరికూటి రామిరెడ్డి,యెదుపాటి వెంకటనారాయణ, జిల్లా తెలుగు యువత కార్యనిర్వహణ కార్యదర్శి మువ్వ కాటంరాజు, సర్పంచ్ సుకదేవ్ యస్సీ సెల్ నాయకులు ఠాగూర్, మైనార్టీ నాయకులు షేక్ మస్తాన్ వలి మరియు రెండు మండలాల తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.