రామ్ నాగర్ లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన కందుల
పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ప్రతినిధి:
పొదిలి పట్టణం దర్శి రోడ్డు లోని రామ్ నాగర్ నందు మార్కాపురం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కందుల నారాయణరెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
తొలుత స్థానిక టిడిపి నాయకులు ముని శ్రీనివాస్ ఆధ్వర్యంలో కందుల కు ఘనస్వాగతం పలికారు
అనంతరం ఇంటి ఇంటికి వెళ్ళి సుపర్ సిక్స్ కరపత్రాలను పంపిణీ చేశారు
ఈ కార్యక్రమంలో పొదిలి మండల పట్టణ తెలుగు దేశం పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు