చంద్రబాబు సాధన దీక్షకు మద్దతు గా కందుల దీక్ష
కరోనా బాధితులను ఆదుకునేందుకు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మార్కాపురం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ మాజీ శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి సాధన దీక్షను చేపట్టారు.
వివరాల్లోకి వెళితే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన పిలుపు మేరకు మార్కాపురం నియోజకవర్గంలో పొదిలి పట్టణము నందు మంగళవారం నాడు స్థానిక తోట చింత చెట్టు వద్ద సాధన దీక్ష తలపెట్టారు ఈ సందర్భంగా కందుల నారాయణ రెడ్డి మాట్లాడుతూ తక్షణమే ప్రతి కుటుంబానికి పదివేల రూపాయలు ఇవ్వాలని కోవిద్ నివారణ జరిగే వరకు ప్రతి కుటుంబానికి ప్రతి నెల 7500 రూపాయలు ఇవ్వాలని ఆక్సిజన్ తో మరణించిన వారికి 25 లక్షల రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని ఫ్రంట్ లైన్ వారియర్స్ కింద జర్నలిస్టులు గుర్తించి వారికి బీమా సౌకర్యం కల్పించాలని అదేవిధంగా వర్షాలతో కుదేలైన వ్యవసాయ రంగాన్ని కాపాడుటకై రైతుల దగ్గర ఉన్న వ్యవసాయ ఉత్పత్తుల ప్రభుత్వమే కొనుగోలు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కాటూరి నారాయణ ప్రతాప్ ,తెలుగు దేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి గునుపూడి భాస్కర్, తెలుగు దేశం పార్టీ పార్లమెంటు కమిటీ నాయకులు పొల్లా నరసింహా యాదవ్, మైనారిటీ విభాగం ఒంగోలు పార్లమెంట్ కమిటీ అధ్యక్షులు షేక్ రసూల్ విద్యార్థి విభాగం ఒంగోలు పార్లమెంట్ కమిటీ కార్యదర్శి షేక్ గౌస్ బాషా, పొదిలి మండల పట్టణ అధ్యక్షులు మీగడ ఓబుల్ రెడ్డి, ముల్లా ఖూద్దుస్, మండల తెలుగు దేశం పార్టీ నాయకులు సన్నెబోయిన సుబ్బారావు, యర్రమూడి వెంకట్రావు ,యస్ ఎం భాషా ,పండు అనీల్, సయ్యద్ ఇమాంసా, జ్యోతి మల్లి, నరసింహారావు,ముని శ్రీనివాస్, మండల తెలుగు యువత నాయకులు కనకం వెంకట్రావు యాదవ్, బాలగాని నాగరాజు పెమ్మని అల్లూరి సీతారామరాజు, రవి కాటూరి శ్రీను బాదం రవి మహిళా నాయకురాలు షేక్ షన్వాజ్ , వివిధ గ్రామాల తెలుగు దేశం పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు