రెండువేల కోట్లతో అభివృద్ధి చేస్తా : కందుల

రెండువేల కోట్లతో నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేస్తానని మార్కాపురం నియోజకవర్గ టిడిపి ఇన్ఛార్జి కందుల నారాయణరెడ్డి అన్నారు. వివరాల్లోకి వెళితే అభివృద్ధి చేస్తున్నాం – ఆశీర్వదించండి పాదయాత్రలో భాగంగా పోతవరం గ్రామంలో ఏర్పాటు చేసిన సభలో కందుల నారాయణరెడ్డి మాట్లాడుతూ గత 4సంవత్సరాల 10నెలల కాలంలో తెలుగుదేశం ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు చేసిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు…… గత ఎన్నికలలో ఓటమి చవిచూసినప్పటికి ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం ద్వారా నియోజకవర్గానికి వెయ్యికోట్లు మంజూరు చేయించి అభివృద్ధి పనులకు శ్రీకారంచుట్టామని అలాగే రాబోయే ఎన్నికలలో ప్రజలు ఆశీర్వదించి గెలిపిస్తే ఈసారి రెండువేల కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపడతానని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసి చైర్మన్ చెప్పిడి రామలింగయ్య, నిర్మమహేశ్వర స్వామి దేవస్థాన కమిటీ చైర్మన్ సామంతపూడి నాగేశ్వరరావు, మండల తెదేపా నాయకులు తాతిరెడ్డి వెంకటేశ్వరరెడ్డి, షేక్ రసూల్, షేక్ జిలాని, యర్రమూడి వెంకట్రావు, ముని శ్రీనివాస్, బత్తిన ఓబయ్య, జ్యోతిమల్లి, యర్రంరెడ్డి వెంకటేశ్వరరెడ్డి, గొంట్లా సాయి కుమార్, ముల్లా జిందాబాషా, ఆరిక రాము, నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.