సభా విలువలు తుంగలో తొక్కి, అధికార మధంతో కౌరవ సభగా మార్చారు : కొనకనమీట్ల మండలం టీడీపీ అధ్యక్షులు మూరబోయిన బాబూరావు
ఆంధ్రుల ఆరాధ్యదైవం అన్న నందమూరి తారక రామారావు గారి కుమార్తె రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సతీమణి శ్రీమతి భువనేశ్వరి గారిని, ఈ రోజు అసెంబ్లీలో వైసీపీ ప్రభుత్వం అవమానిస్తూ, అవహేళన చేస్తూ మాట్లాడం దారుణం అని, ఇదీ యావత్తు మహిళా జాతికి జరిగిన అవమానం అని కొనకనమీట్ల మండలం టీడీపి అధ్యక్షులు *మూరబోయిన బాబూరావు గారు వైసీపీ నాయకుల ధోరణిని తీవ్రంగా ఖండించారు…
మహిళలు ఎంతో పవిత్రంగా భావించే, కార్తీక పౌర్ణమి పండుగ అని” అటువంటి మహిళలకు ఇష్టమైన, పవిత్రమైన రోజున, దేవాలయం లాంటి అసెంబ్లీలో వైసీపీ వారు ఆంధ్రుల ఆరాధ్య దైవం అయిన అన్న ఎన్టీఆర్ గారి కుమార్తె ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి సతీమణి గారిని అవమామిస్తూ, అవహేళన చేస్తూ మాట్లాడటం చాలా బాధాకరం, అని మహిళలు అంటే
ఆ పార్టీకి, ఎంత గౌరవం ఉందో అర్ధం అవుతోందన్నారు.
ఇప్పటికే కొంతమంది మంత్రులు, అధికారపార్టీ ఎమ్మెల్యే లు ఎటువంటి బాష వాడుతోన్నారో, రాష్ట్ర ప్రజానీకం మొత్తం చూస్తోందని, విళ్ళా
మన ప్రజా ప్రతినిధులు అని ప్రజలు విసిగిపోతున్నారని, ఈ రోజు జరిగిన సంఘటన అసెంబ్లీ చరిత్రలో మాయని మచ్చగా నిలుస్తోందని, ఇప్పటికే ఎన్నోసార్లు వైసీపీ ప్రభుత్వం చంద్రబాబు గారిని, టీడీపీ క్యాడర్ ను ఎన్నో అవమానాలకు గురి చేస్తోందని ముఖ్యంగా వ్యక్తిగతంగా విమర్శలు చేస్తున్నారు
ఈ రోజు అతినీచంగా చంద్రబాబు గారి కుటుంబసభ్యులను, అందులో ఆంధ్రుల ఆరాధ్య దైవం అన్న NTR గారి కుమార్తె భువనేశ్వరి గారి గురించి, అవమానకరంగా మాట్లాడటం చాలా దారుణం, మహిళలు అంటే ఈ వైసీపీ ప్రభుత్వంలో కొంతమంది ప్రజా ప్రతినిధులకు, ప్రభుత్వ పెద్దలకు అసలు గౌరవం, మర్యాద లేవని ఈ రోజు సంఘటనతో అది రుజువైంది.
ఈ రోజు జరిగిన ఘోర ఘటనతో చంద్రబాబు గారు ఎప్పుడు లేని విధంగా కంట తడిపెట్టి ఇంత దౌర్భాగ్య సంఘటనలు జరిగే ఈ సభ లో ఈ ప్రభుత్వం కొనసాగినంతకాలం మళ్ళీ తాను అడుగుపెట్టనని, ఇటువంటి దుర్మార్గపు నాయకులు ప్రజా సమస్యల పై ద్రుష్టి పెట్టకుండా, ప్రతి పక్షం నాయకుడి యొక్క పర్సనల్, మరియు వారి కుటుంబ సభ్యులను టార్గెట్ చేస్తూ మాట్లాడటాన్ని నిరసిస్తూ, ఇక ఈ అసెంబ్లీలో అడుగు పెట్టనని, గతంలో కూడా ఇలాగే అన్న NTR గారిని అప్పటి ప్రభుత్వం అవమానిస్తే మళ్ళీ ముఖ్యమంత్రి గానే అడుపెడతామని శపధం చేసి మళ్ళీ ఆయన 1994 లో ప్రజా దీవెనలతో ముఖ్యమంత్రి గా అసెంబ్లీలో అడుగుపెట్టారని మళ్ళీ అదే చరిత్ర పునరావృతం అవుతోందని, 2024లో కూడా ఈ రాక్షస పాలనకు, ప్రజలు ఓటు ద్వారా తగిన బుద్ది చెప్పి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా అసెంబ్లీకి ఘనంగా తీసుకువెళ్తాము అని ఒక ప్రకటన లో తెలిపారు