కొనకనమీట్ల మండల పరిషత్ అధ్యక్షులు మురళి కృష్ణ యాదవ్ ప్రమాణస్వీకారం

కొనకనమీట్ల మండల పరిషత్ అధ్యక్షులు మురళి కృష్ణ యాదవ్ ప్రమాణస్వీకారం

కొనకనమీట్ల మండల పరిషత్ అధ్యక్షులు మోరబోయిన మురళి కృష్ణ యాదవ్ ఉపాధ్యక్షులు గా గొగంటి జెన్నిఫాలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

స్థానిక కొనకనమీట్ల మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయం నందు శుక్రవారం నాడు రిటర్నింగ్ అధికారి కె వి విజయ్ కుమార్ అధ్యక్షతన తో ప్రత్యేక సమావేశం నిర్వహించి ఎంపిటిసి సభ్యుల చేత ప్రమాణస్వీకారం చేయించి అనంతరం మండల పరిషత్ అధ్యక్షులు మోరబోయిన మురళి కృష్ణ యాదవ్ ఉపాధ్యక్షులు గొగంటి జెన్నిఫా ల చేత ప్రమాణస్వీకారం చేయించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మార్కాపురం నియోజకవర్గం శాసనసభ్యులు కుందూరు నాగార్జున రెడ్డి హాజరయ్యారు

అనంతరం మండల పరిషత్ అధ్యక్షులు గా ఎన్నికైన మోరబోయిన మురళి కృష్ణ యాదవ్ మాట్లాడుతూ కొనకనమీట్ల మండలాన్ని జిల్లాలోనే ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని
తనకు పదవి రావటానికి కారణమైన మాజీ శాసనసభ్యులు ఉడుముల శ్రీనివాసులురెడ్డికి శాసనసభ్యులు కుందూరు నాగార్జున రెడ్డి కి కృతజ్ఞతలు తెలిపారు