ఎన్టీఆర్ కు ఘనంగా నివాళులర్పించిన కొనకనమిట్ల తెదేపా నాయకులు
కొనకనమీట్ల మండలం వెంగళపల్లి గ్రామంలోని ఎన్టీఆర్ విగ్రహానికి తెలుగు దేశం పార్టీ నాయకులు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
కొనకనమిట్ల మండల తెలుగు దేశం పార్టీ అధ్యక్షులు మూరబోయిన బాబురావు యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన తెలుగు దేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు మరియు మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు 26 వర్ధంతి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మార్కాపురం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్ కందుల నారాయణరెడ్డి హాజరై ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో తెలుగు దేశం పార్టీ నాయకులు చప్పిడి రామ లింగయ్య , వెంకట నారాయణ, తెలుగు యువత ఒంగోలు పార్లమెంట్ కమిటీ కార్యనిర్వహణ కార్యదర్శి మువ్వ కాటంరాజు యాదవ్, నియోజకవర్గ అధ్యక్షులు సుకదేవ్ , బిసి సెల్ అధ్యక్షులు అంకాల రోసయ్య, మరియు వివిధ గ్రామాల నాయకులు మరియు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు