రాష్ట్రానికి లక్షల కోట్ల ఇచ్చిన అభివృద్ధి శూన్యం – భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు
కేంద్ర ప్రభుత్వం గత ఎనిమిది సంవత్సరాలలో 8లక్షల16 వేల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చిన అభివృద్ధి మాత్రం శూన్యమని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కమిటీ అధ్యక్షులు సోము వీర్రాజు అన్నారు.
మంగళవారం నాడు స్థానిక పొదిలి మంజునాథ కళ్యాణ మంటపం నందు జరిగిన భారతీయ జనతా పార్టీ ప్రకాశం జిల్లా పదాధికారుల సమావేశం ఒంగోలు పార్లమెంట్ కమిటీ అధ్యక్షులు శ్రీనివాస్ అధ్యక్షతనతో జరిగింది.
ఈ కార్యక్రమంకు ముఖ్య అతిథిగా హాజరైన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు మాట్లాడుతూ గతంలో అధికారంలో ఉన్న తెలుగు దేశం పార్టీ ప్రభుత్వం ప్రస్తుతం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ప్రభుత్వం రెండు ప్రభుత్వాలు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసయని తీవ్రంగా దుయ్యబట్టారు.
సమావేశం అనంతరం స్థానిక పిచ్చి రెడ్డి కాలనీ లోని గిరిజనుల ఆహ్వానం మేరకు అక్కడి వెళ్లి వారి తో సమావేశమై వారి ఎదుర్కొంటున్న సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు.
అంకాల పరమేశ్వరి గుడి అడ్డుకొనే దమ్ము ధైర్యం ఎవ్వరికి లేదని అలాంటి పరిస్థితి ఉంటే తాట తీస్తామని హెచ్చరించారు.
అనంతరం స్థానిక గిరిజనులు భారతీయ జనతా పార్టీ శ్రేణులకు భోజనం వసతి కల్పించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ నాయకులు జిల్లా కమిటీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు