బెల్లంకొండ మద్దతు కోరిన మాగుంట
పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ప్రతినిధి:
ఒంగోలు పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసరెడ్డి ఆదివారం నాడు స్థానిక పొదిలి పట్టణం బెల్లంకొండ నగర్ లోని బెల్లంకొండ విద్యాసంస్థల అధినేత మరియు బిజెపి జిల్లా అధికార ప్రతినిధి బెల్లంకొండ విజయలక్ష్మి నివాస గృహానికి వెళ్లి వారి మద్దతును కోరారు.
తొలిత బెల్లంకొండ విద్యా సంస్థల చైర్మన్ బెల్లంకొండ శ్రీనివాస్ బీజేపీ అధికార ప్రతినిధి బెల్లంకొండ విజయలక్ష్మి మాగుంట శ్రీనివాస్ రెడ్డికి స్వాగతం పలికారు
అనంతరం ఎన్నికల్లో అనుసరించాల వ్యూహంపై వారితో మాగుంట శ్రీనివాసులు రెడ్డి చర్చించారు.
ఈ కార్యక్రమంలో బెల్లంకొండ విద్యాసంస్థల సిబ్బంది మరియు ఎన్డీఏ కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు