భారతీయ జనతాపార్టీ లో పలువురి చేరిక
పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ప్రతినిధి:
భారతీయ జనతాపార్టీ లో పలువురు ప్రముఖులు పార్టీ చేరారు.
వివరాల్లోకి వెళితే ఆదివారం నాడు స్థానిక విశ్వనాథపురం లోని ఒక నివాస గృహాంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ ప్రకాశం జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో వివిధ సామాజిక వర్గాలకు చెందిన కందూకూరి రామకోటయ్య,యాదాల కోటేశ్వరరావు,చీమలమర్రి చంద్రశేఖర్ , వాడకండ్ల వెంకటేశ్వర్లు , కొట్రా నరసింహారావు, దొడ్డేపల్లి గురుబ్రహం లకు బిజెపి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు