ఎమ్మెల్సీ ఓట్లు నమోదు పై కుందూరు సమీక్ష
పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ప్రతినిధి:
తూర్పు రాయలసీమ పట్టభద్రులు నియోజకవర్గం పరిధిలోని పట్టభద్రులు ఓట్లు నమోదు గురించి స్థానిక శాసనసభ్యులు కుందూరు నాగార్జున రెడ్డి ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఆదివారం నాడు స్థానిక దర్శి రోడ్ లోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యాలయం నందు శాసనసభ్యులు కుందూరు నాగార్జున రెడ్డి ఆధ్వర్యంలో మండల పట్టణ నాయకులతో సమీక్ష సమావేశం నిర్వహించి అర్హత కల్గిన పట్టభద్రుల ఓట్లు నమోదు ప్రక్రియ అనుసరించే వ్యూహం పై చర్చించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఖనిజ అభివృద్ధి సంస్థ డైరెక్టర్ కసిరెడ్డి వెంకట రమణ రెడ్డి, ఈడిగ కార్పొరేషన్ డైరెక్టర్ జూపల్లి ఏడుకొండలు, సోసైటి ఛైర్మన్ కొత్తపులి బ్రహ్మ రెడ్డి,మండల అధ్యక్షులు శ్రీనివాసులురెడ్డి,పట్టణ అధ్యక్షురాలు షేక్ నూర్జహాన్, ప్రధాన కార్యదర్శి గొలమారి చెన్నారెడ్డి,మండల పార్టీ నాయకులు జి శ్రీనివాస్ , గోపి , సర్పంచ్ శిరిమల్లే శ్రీనివాస్ యాదవ్, మాజీ సర్పంచ్ పులగోర్ల శ్రీనివాస్ యాదవ్, పట్టణ కార్యదర్శి కోగర వెంకట్రావు యాదవ్ పట్టణ నాయకులు యక్కలి శేషగిరిరావు మరియు మండల,పట్టణ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు