మోడీ నిర్ణయం ఒక చారిత్రాత్మక ఘట్టం : తోట విజయలక్ష్మి
అగ్రవర్ణాల పేదలకు 10శాతం రిజర్వేషన్ కు కేంద్ర కేబినెట్ ఆమోదం ఒక చారిత్రాత్మక ఘట్టమని బీజేపీ రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు తోట విజయలక్ష్మి అన్నారు. స్థానిక బెల్లంకొండ విద్యాసంస్థలలో అగ్రవర్ణాల పేదలకు 10శాతం రిజర్వేషన్ కల్పించడంపై బెల్లంకొండ శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన చర్చా కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా హాజరైన రాష్ట్ర బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు తోట విజయలక్ష్మి మాట్లాడుతూ మోడీ తీసుకున్న నిర్ణయంపై విద్యార్థులను తమ సందేహాలను తెలుపమని కోరగా…… సునీల్ అనే విద్యార్థి మాట్లాడుతూ ఎన్నికల సమయంలో తీసుకున్న ఈ నిర్ణయం ముందే ఎందుకు తీసుకోలేదు ఎన్నికల కోసమేనా అని ప్రశ్నించగా విజయలక్ష్మి సమాధానం ఇస్తూ జిఎస్టీ, నోట్ల రద్దు ఇలా ఒకదాని తర్వాత ఒకటి చేసుకుంటూ వస్తున్నామని ఇది ఎన్నికల కోసం కాదని సమాధానం ఇచ్చారు. వాబిదా అనే విద్యార్థిని మాట్లాడుతూ ఈ 10శాతానికి సంబంధించిన పరిమితులను తెలపాలని కోరగా అగ్రవర్ణాలలో పెదలైన ప్రతి ఒక్కరికి ఈ రిజర్వేషన్ వలన లబ్ది చేకూరుతుందని సమాధానమిచ్చారు. ఈ కార్యక్రమంలో బెల్లంకొండ విద్యాసంస్థలు అధినేతలు బెల్లంకొండ శ్రీనివాసరావు, బెల్లంకొండ విజయలక్ష్మి, ఫార్మసీ కళాశాల ప్రిన్సిపాల్ ఎన్. నాయుడు, సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.