దేశవ్యాప్తంగా జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు
దేశవ్యాప్తంగా 3 పార్లమెంట్ 29శాసనసభ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో ఫలితాల వివరాలు
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఖాండ్వా లోకసభ ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి జ్ఞానేశ్వర్ పాటిల్ తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాజ్ నారాయణ సింగ్ పై 82 వేల మెజారిటీతో గెలుపొందారు.
హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని మండి లోకసభ జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ప్రతిభా సింగ్ సమీప ప్రత్యర్థి భారతీయ జనతాపార్టీ అభ్యర్థి కౌశల్ సింగ్ ఠాగూర్ పై 6500 స్వల్ప మెజారిటీతో గెలుపొందారు.
దాద్రా & నగర్ హవేలీ డామన్ లోక్ సభ
ఉప ఎన్నికల్లో శివసేన పార్టీ అభ్యర్థి డెల్కర్ కాలాబెన్ మోహన్ బాయ్ తాను సమీప ప్రత్యర్థి భారతీయ జనతాపార్టీ అభ్యర్థి గవిత్ మహేష్ భాయ్ పై 50 వేల మెజారిటీతో గెలుపొందారు.
వివిధ రాష్ట్రాల జరిగిన ఉప ఎన్నికల్లో ఫలితాలలో ఆంధ్రప్రదేశ్ లోని బద్వేల్ శాసనసభ ఉప ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దాసరి సుధా తన సమీప ప్రత్యర్థి భారతీయ జనతాపార్టీ అభ్యర్థి పనతల సురేష్ పై 90533 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.
అస్సాం లో ఐదు శాసనసభ స్థానాలకు ఉప ఎన్నికలు జరగ్గా అందులో భారతీయ జనతా పార్టీ 3 యునైటెడ్ పీపుల్స్ పార్టీ రెండు స్థానాలు గెలుపొందాయి.
బీహార్ లో రెండు స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో రెండు స్థానాలు అధికార యూనిటెడ్ జనతా దళ్ పార్టీ కైవసం చేసుకుంది.
భారతీయ జనతాపార్టీ అధికారంలో ఉన్న హర్యానాలో జరిగిన ఒక ఉప ఎన్నిక శాసనసభ స్థానాని ఇండియన్ నేషనల్ లోక దళ్ పార్టీ కైవసం చేసుకుంది .
భారతీయ జనతాపార్టీ అధికారంలో ఉన్న హిమాచల్ ప్రదేశ్ మూడు స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో మూడు స్థానాలను ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది.
భారతీయ జనతాపార్టీ అధికారంలో ఉన్న కర్ణాటక రాష్ట్రంలో జరిగిన ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ చేరి ఒక్కొక స్థానాన్ని కైవసం చేసుకున్నాయి.
భారతీయ జనతాపార్టీ అధికారంలో ఉన్న మధ్యప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఉప ఎన్నికల్లో రెండు స్థానాల్లో భారతీయ జనతా పార్టీ ఒక స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకున్నాయి.
శివ సేన అధ్వర్యంలో అధికారంలో ఉన్న మహారాష్ట్రలో జరిగిన ఒకే ఒక స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది.
మేఘాలయాలో మూడు స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో నేషనల్ పీపుల్స్ పార్టీ రెండు స్థానాలను పార్టీ ఒక స్థానాన్ని కైవసం చేసుకున్నాయి.
మిజోరంలో ఒక్క స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో మిజో నేషనల్ ఫ్రంట్ విజయం సాధించింది.
నాగాలాండ్ లో ఒక్క స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో నేషనల్ నేషనల్ లిస్ట్ డెమొక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ విజయం సాధించింది.
రాజస్థాన్ లో రెండు ఉప ఎన్నికలు జరిగిన ఎన్నికల్లో రెండు స్థానాలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది.
పశ్చిమ బెంగాల్ నందు జరిగిన ఉప ఎన్నికల్లో నాలుగు స్థానాల్లో తృణమూల్ కాంగ్రెస్ కైవసం చేసుకుంది.
తెలంగాణలోని హుజురాబాద్ శాసనసభకు జరిగిన ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఈటల రాజేందర్ తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థి శ్రీనివాస్ యాదవ్ పై 24 వేల మెజార్టీతో గెలుపొందారు