ఘనంగా ఎన్టీఆర్ 97వ జయంతి వేడుకలు
వివరాల్లోకి వెళితే తెలుగుదేశం పార్టీ నాయకులు గునుపూడి భాస్కర్ ఆధ్వర్యంలో గురువారంనాడు స్థానిక పెద్ద బస్టాండులోని ఎన్టీఆర్ విగ్రహానికి తెలుగుదేశం పార్టీ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పటేల్, పట్వారీ వ్యవస్థను రద్దుచేసి సంచలనం సృష్టించి….. మండల వ్యవస్థను ఏర్పాటు చేసి వ్యవస్థీకృత మార్పులకు శ్రీకారం చుట్టారని….. దానితో పాటు మహిళలకు ఆస్తి హక్కు మరియు స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు కల్పించడం వంటి అనేక సామాజిక రాజకీయ మార్పులకు శ్రీకారం చుట్టిన మహా నాయకుడు నందమూరి తారక రామారావు అంటూ ఆయన చేసిన సేవలను కొనియాడారు.
ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు గునుపూడి భాస్కర్, కాటూరి నారాయణబాబు, యర్రంరెడ్డి వెంకటేశ్వరరెడ్డి, సామంతపూడి నాగేశ్వరరావు, పండు అనీల్, షేక్ రసూల్, సయ్యద్ ఇమాంసా, ముల్లా ఖుద్దూస్, తదితరులు పాల్గొన్నారు.