సూదనగుంట లో గడప గడపకు మన ప్రభుత్వం

పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ‌ ప్రతినిధి:

 

పొదిలి మండలం సూదనగుంట గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు.

బుధవారం నాడు స్థానిక సూదనగుంట గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి మార్కాపురం నియోజకవర్గం శాసనసభ్యులు కుందూరు నాగార్జున రెడ్డి పాల్గొని ప్రజల నుంచి పలు విజ్ఞాపనలు స్వీకరించి త్వరలో పరిష్కారానికై కృషి చేస్తానని తెలిపారు

అదే విధంగా పలువురు లబ్దిదారులకు పత్రాలను అందజేశారు.

తొలుత శాసనసభ్యులు కుందూరు నాగార్జున రెడ్డి గ్రామంలో అడుగు పెడుతున్న సందర్భంగా రాష్ట్ర ఖనిజ అభివృద్ధి సంస్థ డైరెక్టర్ కసిరెడ్డి వెంకట రమణ రెడ్డి ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు.

ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ మరియు వివిధ శాఖల ప్రభుత్వం అధికారులు మరియు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు