పాక్షికంగా తెలుగు దేశం పార్టీ తలపెట్టిన బంద్
మంగళవారం నాడు తెలుగు దేశం పార్టీ రాష్ట్ర కార్యాలయం పై దాడికి నిరసిస్తూ తెలుగుదేశం పార్టీ ఇచ్చిన రాష్ట్ర బంద్ పాక్షికంగా ముగిసింది.
తెల్లవారుజామున స్థానిక ఆర్టీసీ బస్టాండ్ వద్ద చెరుకున్న తెలుగు దేశం పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ తమ నిరసనను వ్యక్తం చేశారు.
అనంతరం విశ్వనాథపురం నుంచి ర్యాలీగా బయలుదేరి స్థానిక పెద్ద బస్టాండ్ వద్ద రాస్తారోకో నిర్వహించి ఎన్టీఆర్ విగ్రహం వద్ద పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఆందోళనను కొనసాగించారు
ఎన్టీఆర్ విగ్రహం వద్ద నుంచి తహశీల్దారు కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు.
రాష్ట్ర బంద్ నేపథ్యంలో ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు, మరియు విద్యా సంస్థలను మూసి వేయగా వ్యాపార సంస్థలు యథావిధిగా కొనసాగాయి.
మొత్తం మీద బంద్ ప్రశాంతంగా పాక్షికంగా జరిగింది.
ఈ కార్యక్రమంలో తెలుగు దేశం పార్టీ నాయకులు పొల్లా నరసింహా యాదవ్ కార్యదర్శి యర్రంరెడ్డి వెంకటేశ్వర రెడ్డి, షేక్ రసూల్ , మీగడ ఓబుల్ రెడ్డి, ముల్లా ఖూద్దుస్, షేక్ గౌస్ బాషా, జ్యోతి మల్లి, నరసింహారావు, తెలుగు యువత నాయకులు కాటూరి శ్రీను, ముల్లా ఖయ్యాం, ముని శ్రీనివాస్ ,ఐటిడిపి ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు