టిడిపిలో పట్నంకు కీలక పదవి
పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ప్రతినిధి:
తెలుగు దేశం పార్టీ శాలివాహన సాధికారత అధ్యయన కమిటీ ఒంగోలు పార్లమెంట్ కమిటీ అధ్యక్షులు పట్నం శ్రీనివాస్ నియమిస్తూ రాష్ట్ర రాష్ట్ర కమిటీ ఉత్తర్వులు జారీచేసింది.
ఆదివారం నాడు స్థానిక కొనకనమిట్ల తెలుగు దేశం పార్టీ అధ్యక్షులు మూరబోయిన బాబురావు యాదవ్ ఆఫీస్ నందు ఒంగోలు పార్లమెంట్ కమిటీ అధ్యక్షులు నూకసాని బాలాజీ యాదవ్ ను పట్నం శ్రీనివాస్ మర్యాద పూర్వకంగా కలిసారు.
ఈ సందర్భంగా పూలమాలతో పట్నం శ్రీనివాస్ సత్కరించి పార్టీ పటిష్టతకు కృషి చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో తెలుగు దేశం పార్టీ ఒంగోలు పార్లమెంట్ కమిటీ కార్యదర్శి యర్రంరెడ్డి వెంకటేశ్వర రెడ్డి కార్యనిర్వహక కార్యదర్శి పోల్లా నరసింహా యాదవ్, కొనకనమిట్ల మండల తెలుగు దేశం పార్టీ అధ్యక్షులు మూరబోయిన బాబురావు యాదవ్ ఐటిడిపి మండల అధ్యక్షులు యేటి ఏడుకొండలు యాదవ్, వార్డు కమిటీ అధ్యక్షులు బాలగాని నాగరాజు తదితరులు పాల్గొన్నారు