పవన్ కళ్యాణ్ అవమాన పరుస్తూ వేసిన ఫ్లెక్సీలు తొలగించలి – జనసేన
పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ప్రతినిధి:
జనసేన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ను కించపరుస్తూ వేసిన ఫ్లెక్సీలు వెంటనే తొలగించాలని కోరుతూ జనసేన పార్టీ ఆధ్వర్యంలో పొదిలి యస్ఐ కోమర మల్లిఖార్జునరావు, పొదిలి మున్సిపల్ కమిషనర్ డానియల్ జోసప్ కు బుధవారం నాడు వినతి పత్రాలను అందజేశారు.
అనంతరం మీడియాతో జనసేన పార్టీ నాయకులు మాట్లాడుతూ తక్షణమే ఫ్లెక్సీలు తొలగించాలని లేకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం తప్పదని హెచ్చరించారు.