ఆరోపణలు నిరూపిస్తే వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి రాజినామా : జి శ్రీనివాసులు
తోపు భూముల్లో అక్రమాలు జరిగాయని ఆరోపణలు నిరూపిస్తే పొదిలి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవికి రాజీనామా చెయ్యిస్తానని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు జి శ్రీనివాసులు తెలిపారు
వివరాల్లోకి వెళితే శుక్రవారం నాడు స్థానిక రోడ్లు మరియు భవనాల అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జి శ్రీనివాసులు మాట్లాడుతూ పొదిలి గ్రామ సర్వే నెంబర్ 1177 /1 నందు సాగు చేసుకొనే రైతులకు అన్యాయం జరిగిందని ఒక్క రైతు చేత కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి సైదా నిరూపిస్తే పొదిలి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా పనిచేస్తున్న తన భార్య జి కోటేశ్వరి చేత రాజీనామా చేయించి రాజకీయాల నుంచి తప్పుకుంటానని నిరుపించలేకపోతే నువ్వు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పదవికి మరియు రాజకీయాలు నుంచి తప్పుకుంటావని సవాల్ విసిరారు
నా కుటుంబం కులవృత్తిని అవమానం పరిచే విధంగా మాట్లాడటం ని దిగజారుడు రాజకీయాలకు నిదర్శనం అని ఇప్పుడుకైన వ్యక్తిగత జీవితల గురించి స్వస్తి పలికి నాపై చేసిన ఆరోపణలను రుజువు చేయ్యాలని హితవు పలికారు