పొదిలి భూకుంభకోణలపై సిబిసిఐడి చేత విచారణ జరిపించాలి : కందుల డిమాండ్

పొదిలి పెద్ద చెరువులో అక్రమంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం

 

పొదిలి మండలం పరిధిలో జరిగిన భూ ఆక్రమణలపై సిబిసిఐడితో విచారణ జరిపించాలని మార్కాపురం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్ మాజీ శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

 

వివరాల్లోకి వెళితే బుధవారం నాడు పొదిలి మండలం పర్యటనలో భాగంగా స్థానిక తెలుగు దేశం పార్టీ కార్యాలయంలో తనను కలిసిన విలేఖరులతో కందుల నారాయణరెడ్డి మాట్లాడుతూ వెలిగొండ ప్రాజెక్టు పరిధిలోకి పొదిలి మండలాన్ని చేర్చి ప్రతి గ్రామానికి త్రాగు సాగు నీరు అందిస్తామని అన్నారు.

 

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు అధికారులు కుమ్మక్కై పొదిలి పెద్ద చెరువులో అక్రమంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని వీటి పై ఉన్నతాధికారుల చర్యలు తీసుకోవాలని లేకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.

 

అధికారంలో రాగానే ఒక సంవత్సరం లో పొదిలి పెద్ద చెరువును సమ్మర్ స్టోరేజ్ గా మార్పు చెస్తామని ఇచ్చిన హామీ ఏమైందని అధికార పార్టీ నాయకులపై విరుచుకుపడ్డారు.

 

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు పెద్ద చెరువును ఎకరాలకు ఎకరాలు లే ఔట్లు వేసుకుంటు అమ్మకాలు నిర్వహిస్తున్నారని విరి వల్ల పెద్ద చెరువు కు సాగర్ జలాలు వచ్చే అవకాశం లేదని తక్షణమే ప్రజలు ముందుకు వచ్చి పెద్ద చెరువు కాపాడుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

 

ఎలాంటి ఉద్యమానికైన ప్రజల వెంట తెలుగు దేశం పార్టీ అండగా ఉంటుందని ఆయన అన్నారు.

 

ఈ కార్యక్రమంలో తెలుగు దేశం పార్టీ ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గ కమిటీ కార్యనిర్వహణ కార్యదర్శి పొల్లా నరసింహా యాదవ్ కార్యదర్శి యర్రంరెడ్డి వెంకటేశ్వర రెడ్డి, మాజీ జెడ్పీటీసీ సభ్యులు కాటూరి వెంకట నారాయణ బాబు, పార్లమెంట్ కమిటీ మైనారిటీ విభాగం అధ్యక్షులు షేక్ రసూల్, మండల పార్టీ అధ్యక్షులు మీగడ ఓబుల్ రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ ఛైర్మన్ చప్పిడి రామ లింగయ్య , పట్టణ అధ్యక్షులు ముల్లా ఖూద్దుస్ ,తెలుగు దేశం పార్టీ నాయకులు సామంతపుడి నాగేశ్వరరావు, సన్నేబోయిన సుబ్బారావు, కల్లూరి సోమయ్య, తెలుగు యువత నాయకులు కనకం వెంకట్రావు యాదవ్, కాటూరి శ్రీను తదితరులు పాల్గొన్నారు